- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫీసుకు వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
దిశ, వెబ్ డెస్క్ :
కరోనా కారణంగా.. దాదాపు రెండు నెలల నుంచి చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం లాక్ డౌన్ 4.0 లో కొన్ని సడలింపులు ఇచ్చింది. దాంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఆఫీసుకు వెళుతున్న ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.
– ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరుతుంటే.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
– హ్యాండ్ శానిటైజర్ తప్పక క్యారీ చేయాలి. లేదంటే సోప్ పేపర్, లేదా సోప్ వెంట ఉన్న ఫర్వాలేదు.
– వాటర్ తాగడానికి ప్రత్యేకంగా వెంట ఓ బాటిల్ తీసుకెళ్లడం మంచిది.
– ప్రధానంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో కాకుండా ఓన్ వెహికల్ తీసుకుని వెళ్లాలి. బైక్ లేదా కార్ లేని వాళ్లు.. పరిస్థితులు కాస్త కుదుటపడే వరకు వెహికల్ రెంట్ తీసుకోవడం ఉత్తమం. బైక్ ను ముట్టుకునే ముందు ‘శానిటైజ్ ’ చేయడం మరిచిపోవద్దు.
– వీలైనంత వరకు బైక్ పై ఒక్కరే వెళ్లండి. ఇద్దరూ వెళ్లాల్సి వస్తే.. హెల్మెట్లు పెట్టుకోవడం మంచిది. కారులో ఇద్దరు మించి ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. కారులో క్రిస్ క్రాస్ పాటర్న్ లో కూర్చోవడం బెటర్.
– లిఫ్ట్ బటన్స్ టచ్ చేయకూడదు. ఒక వేళ చేయాల్సి వస్తే.. టిష్యూ లేదా టూత్ పిక్ తో టచ్ చేయండి. లిఫ్ట్ ను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. లిఫ్ట్ లో కూడా ఇద్దరు మించి వెళ్లకూడదు. మెట్లపై వెళుతుంటే.. గోడలు, రెయిలింగ్ తాకకూడదు.
– ఆఫీసు వర్క్ మొదలు పెట్టే ముందు.. టేబుల్ ను, చెయిర్ ను శానిటైజ్ చేయాలి. కంప్యూటర్, కీ బోర్డ్ లను కూడా మంచిగా శుభ్రపరచాలి.
– మీరు కూర్చునే సీటుకు, మీ కొలిగ్ కు మధ్య తప్పనిసరిగా దూరం ఉండాలి సీటింగ్ అరేంజ్ మెంట్ ఉండాలి.
– బాస్ వచ్చినా, కొలిగ్ పలకరించినా.. హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు. నమస్కారం పెడితే చాలు.
– మీటింగ్ లు అవాయిడ్ చేయాలి. ఒక వేళ తప్పనిసరైతే.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మీటింగ్ లు కండక్ట్ చేయాలి.
– ఆఫీసులో డోర్ నాబ్ కానీ, ఫైల్స్ కానీ ఏవీ టచ్ చేసినా.. శానిటైజ్ చేసుకోవాలి.
-లంచ్ కు ముందు చేతులకు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. బయట ఫుడ్ పూర్తిగా అవాడ్ చేయాలి. లంచ్ చేసేటప్పుడు కూడా భౌతిక దూరం పాటించాలనే సూత్రాన్ని మరవకూడదు.
– ఇంటికి వెళ్లే ముందు హెల్మెట్, వాలెట్, కీ, బైక్ ఇంకా ఇతర వస్తువులు శానిటైజ్ చేసుకోవాలి.
-ఇంటికి వెళ్లాక.. షూ లేదా చెప్పులు శానిటైజ్ చేయాలి. బట్టలు వేడినీటిలో నానపెట్టాలి. స్నానం చేయాలి.
– మొబైల్ ఫోన్ ను తప్పక శానిటైజ్ చేయాలి.
– జలుబు చేసినా, దగ్గు వస్తున్నా… జ్వరం వచ్చినా.. ఆఫీసు వెళ్లడం అవాయిడ్ చేయండి.