‘రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశం ఎప్పటికీ క్షమించదు’

by Shamantha N |
‘రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశం ఎప్పటికీ క్షమించదు’
X

న్యూఢిల్లీ: చైనాకు 43,000 చ.కి.మీ భారత భూభాగాన్ని వదలిపెట్టిన గాంధీ కుటుంబాన్ని దేశం ఎప్పటికీ క్షమించదని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎడాపెడా అబద్ధాలు ఆడాడని ఆరోపించింది. భారత భద్రతా బలగాలను అప్రతిష్ఠ పాలు చేస్తున్నాడని పేర్కొంది. రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం అనంతరం కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుప్డారు.

‘ఒకరికి నైతిక విలువలు లేనప్పుడు, ఒకరు సానుకూలంగా ఏమీ మాట్లాడలేనప్పుడు, అతను అబద్ధాలను ఆశ్రయిస్తాడు. రాహుల్ గాంధీ ఎడాపెడా అబద్ధాలు ఆడాడు. బహుశా ప్రధాన మంత్రి కాలేకపోయినందుకు రాహుల్ గాంధీ తీవ్ర నిరాశలో ఉన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అశేషమైన ప్రజా మద్దతును రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని, ఆయన నీడ కూడా దాని అంగీకరించదు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మానసిక ఆరోగ్యంపై ప్రహ్లాద్ జోషి అనుమానాలు వ్యక్తం చేశారు. భారత భద్రతా బలగాల త్యాగాలు, శక్తిని రాహుల్ గాంధీ అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేస్తుంటారని, ఎవరిని సంతృప్తిపర్చడానికి ఇదంతా చేస్తున్నారు? ఎందుకు? ఎందుకోసం అంటే చైనా సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీకి విరాళాలు వచ్చాయి అని, చైనాకు చెందిన వ్యక్తులతో రాహుల్ గాంధీ సమావేశం ఎప్పటికీ మర్చిపోలేమని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed