ప్రభాస్ – నాగ్‌అశ్విన్ మూవీ బిగ్ అప్‌డేట్

by Shyam |
ప్రభాస్ – నాగ్‌అశ్విన్ మూవీ బిగ్ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాట ఇచ్చినట్లుగానే ప్రభాస్ కాంబినేషన్ మూవీ అప్‌డేట్ ఇచ్చాడు డైరెక్టర్ నాగ్‌అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్‌గా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించిన దర్శకుడు తాజాగా సినిమాకు పనిచేయబోయే ఇద్దరు కీలక వ్యక్తుల గురించి అప్‌డేట్ ఇచ్చారు.

డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, మ్యూజిక్ డైరెక్టర్ గురించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇంతకు ముందు తనతో కలిసి ‘మహానటి’ కోసం వర్క్ చేసిన యురోపియన్ ఫిల్మ్ మేకర్ డాని సంచెజ్-లోపేజ్‌నే మళ్లీ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా, మిక్కీ జే మేయర్‌ను సంగీత దర్శకులుగా రిపీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘వెల్ కమ్ బ్యాక్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ మహానటి’ అంటూ ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీకి వెల్‌కమ్ చెప్పారు.

Advertisement

Next Story