శూలం పట్టిన పవర్ స్టార్.. ఫోటోస్ వైరల్

by Anukaran |   ( Updated:2021-04-02 03:46:07.0  )
శూలం పట్టిన పవర్ స్టార్.. ఫోటోస్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి సినిమాకు హీరోనే బలం.. ఇక ఆ సినిమా కోసం హీరో పడే కష్టాలు మాములుగా ఉండవు. ప్రతి సినిమాలోనీ క్యారెక్టర్ కి తగ్గట్టు వారు మారిపోతూ ఉంటారు. తెరపై ఒక సీన్ అద్భుతంగా రావాలంటే దాని వెనుక హీరోల కష్టం అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇక పీరియాడికల్ డ్రామా అంటే కత్తిసాములు, గుర్రపు స్వారీలు ముందు నుండే నేర్చుకుంటూ ఉంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ‘హరిహర వీర మల్లు’ చిత్రం కోసం కత్తిసాము, శూల కళను అభ్యసించారు. బ్లాక్ జిమ్ వేర్‌లో ఉన్న ప‌వ‌న్ ట్రైన‌ర్ శ్యామ్ కుషల్ తో క‌లిసి విన్యాసాలు నేర్చుకుంటున్నాడు. ఎంతో ఒడుపుగా శూలం ను పట్టుకొని కసరత్తులు చేస్తున్న పవన్ ఫోటోలు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నాయి.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘హరిహర వీర మల్లు’ కోసం పవన్ ఎంతో కష్టపడినట్లు ఈ ఫోటోలను చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక పవన్ ముందు నుండి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందినవాడని అందరికి తెలుసు.. దీంతో ఈ శూల కళను పవన్ త్వరగా నేర్చుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లో శూలం పట్టుకొని జంప్ చేసిన సీన్ ఎంతటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో సైతం ఈ యాక్షన్ సీన్స్ ను ఫ్యాన్స్ ఈలలు వేసేలా క్రిష్ తెరకెక్కిస్తున్నాడంట. అలా అయితే థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలే..

Advertisement

Next Story