పోస్ట్‌మాన్ చేతివాటం.. ఖాతాదారుల డబ్బులు గోల్‌మాల్

by srinivas |   ( Updated:2021-12-13 05:15:07.0  )
పోస్ట్‌మాన్ చేతివాటం.. ఖాతాదారుల డబ్బులు గోల్‌మాల్
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస మండలం తోటాడ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్‌మాన్ చేతివాటం చూపాడు. బ్రాంచ్‌లో పోస్టు‌మెన్‌గా చేస్తున్న శశికుమార్ ఫిక్స్‌డ్, మంత్లీ డిపాజిట్ల ద్వారా ఖాతాదారులు కట్టిన డబ్బులను సొంతానికి వాడేశాడు. అయితే గత కొన్ని నెలలుగా మెచ్యూరిటీ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో ఖాతాదారులకు అనుమానం వచ్చింది. వెంటనే హెడ్ పోస్టాఫీసును ఖాతాదారులు సంప్రదించారు. ఖాతాదారుల ఆరోపణలపై స్పందించిన ఉన్నతాధికారి పోస్టుమాన్ ఆ నగదు జమ చేయలేదని నిర్ధారించారు. ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో శశికుమార్ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన ఖాతాదారులు తోటాడ బ్రాంచ్ పోస్టు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story