ఉద్యోగుల స‌మ‌స్యలపై సీఎం సానుకూల నిర్ణయం

by  |   ( Updated:2021-03-10 08:38:04.0  )
ఉద్యోగుల స‌మ‌స్యలపై సీఎం సానుకూల నిర్ణయం
X

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్: ఉద్యోగుల స‌మ‌స్యల పై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవ‌డం ప‌ట్ల టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు క‌స్తూరి వెంక‌టేశ్వర్లు హ‌ర్షం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం అబిడ్స్ తిల‌క్ రోడ్డులోని భీమాభ‌వ‌న్ లో టీఎన్జీవో న‌గ‌ర శాఖ కార్యద‌ర్శి క‌ట్కూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో భోజ‌న విరామ స‌మ‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌తోక‌లిసి సీఎం కేసీఆర్ చిత్రప‌టానికి క్షీరాభిషేకం చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. అనంత‌రం వెంక‌టేశ్వర్లు మాట్లాడుతూ భీమాభ‌వ‌న్ కు ఎంతో ఉద్యమ చ‌రిత్ర ఉంద‌న్నారు. నాడు రాష్ట్రం ఏర్పాటు స‌మ‌యంలో నిర‌స‌న కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొద‌ల‌య్యాయ‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంత‌రం ఉద్యోగుల‌తో స్నేహ పూర్వకంగా ఉంటున్న ప్రభుత్వం నేడు వారి స‌మ‌స్యల‌పై సానుకూల నిర్ణయం తీసుకోవ‌డం ప‌ట్ల సంతోషంవ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో సీపీఎస్ కూడా ర‌ద్దవుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్సీ, వ‌యో ప‌రిమితి పెంపు , ఏపీలో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను స్వ రాష్ట్రానికి తీసుకురావ‌డ‌మే కాకుండా ఇత‌ర అన్ని స‌మ‌స్యలు కూడా ప్రధాన్యతాక్రమంలో ప‌రిష్కారం అవుతాయ‌ని, సీఎం కేసీఆర్ పై త‌మ‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్యక్రమ‌లో టీఎన్జీవో నాయ‌కులు శ్రీనివాస్,చందు, నాల్గవ త‌ర‌గ‌తి ఉద్యోగ సంఘ నాయ‌కులు రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed