- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంట్రాక్టర్ల కక్కుర్తి.. నర్సంపేటలో మొరంతో నిర్మాణాలు
దిశ, నర్సంపేట టౌన్: అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో నర్సంపేట మొదటి స్థానాన్ని సంపాదించింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్ర రుణ సంస్థ నుంచి అప్పు తెచ్చి మరీ సెంట్రల్ లైటింగ్, డబుల్ డివైడర్లు, ప్లాట్ ఫాంలు, పార్కులు, జంక్షన్లను నిర్మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటికే నర్సంపేట పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తికాగా డబుల్ డివైడర్లు, సింగిల్ డివైడర్ల పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో కాంట్రాక్టర్లు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన నిర్మాణాలను మట్టితో చేస్తూ తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు చేసేది కాంట్రాక్టర్లు బాగుపడటం కోసమా? ప్రజల కోసమా? అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం వరంగల్ రోడ్డులోని వివేకానంద కాలనీ పరిసర ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు సైతం దొడ్డు కంకర, మట్టి, మొరం, దొడ్డు ఇసుకను కలిపి నిర్మాణం చేస్తుండటంతో స్థానికులు, వాహనదారులు ‘భళా నర్సంపేట’ అని కామెంట్ చేస్తున్నారు.
నాణ్యతలేని పనులతో పరేషాన్..
నర్సంపేట పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ఆరాటం నీరుగారిపోతోంది. ఆయన ఆశయాలను తూట్లు పొడుస్తూ నాణ్యతలేని పనులతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మురికి సిటీగా తయారుచేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గతేడాది పట్టణంలో సెంట్రల్ డివైడర్‌లో పోసిన మట్టి వల్ల మొక్కలు చనిపోతున్నాయని, ఆ మట్టిని ఈ ఏడాది తీసేసి మళ్లీ ఎర్రమట్టి పోయడం వల్ల ఉపయోగం ఏంటని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక పదికాలాల పాటు మన్నికగా ఉండాల్సిన కట్టడాలు, నిర్మాణాలు ఇలా దొడ్డు ఇసుకతో, మట్టితో, మొరంతో నిర్మాణాలు చేస్తే వెంటనే పాడవుతాయని, వీటిపై ఎమెల్యే దృష్టి పెట్టాలని పలువురు పట్టణ వాసులు కోరుతున్నారు.