- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- మంత్రి తలసాని
దిశ, బేగంపేట: సరైన వైద్య చికిత్సలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక మందిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని, పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద బేగంపేటకు చెందిన ఖలీల్‌ఖాన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయ మంజూరు పత్రాన్ని అందజేశారు.
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఖలీల్‌ఖాన్‌కు నిమ్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స చేయాలని చెప్పారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఖలీల్‌ఖాన్ కలిసి తన పరిస్థితిని వివరించి చికిత్స కోసం సహకారం అందించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు ఇప్పించారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, తెరాస నాయకులు శ్రీహరి ముదిరాజ్ డివిజన్ అధ్యక్షులు రాజన్న శ్రీనివాస్ గౌడ్, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.