- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ప్యాకప్ చెప్పిన బుట్టబొమ్మ
![ప్యాకప్ చెప్పిన బుట్టబొమ్మ ప్యాకప్ చెప్పిన బుట్టబొమ్మ](https://www.dishadaily.com/wp-content/uploads/2021/01/puja-hegde.jpg)
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. బుట్ట బొమ్మ పూజా హెగ్డే రెబల్ స్టార్‌కు జోడిగా నటిస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా, 30 రోజుల లాంగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న పూజ, తన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.
‘రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీటెడ్.. ఇట్స్ టైమ్ టు ఫ్లైట్’ అంటూ రాసుకొచ్చిన పూజ, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన పూజ, తన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కేక్ కట్ చేసింది. ఆ ఫొటోలకు జతగా ‘ఎవరి పుట్టిన రోజూ లేదు. కేక్ తినాలనిపించింది అంతే ..యాన్ ఎక్స్‌క్యూజ్ టు ఈట్ కేక్’అని కామెంట్ చేసింది. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ‘రాధే శ్యామ్’మూవీని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. అక్కినేని అఖిల్‌తో కలిసి పూజ నటించిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.