- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్యాకేజీ-9 అక్టోబర్ వరకు కాకపోతే రాజీనామా చేయ్ : పొన్నం
దిశ, కరీంనగర్ :
ఐటీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శనాస్త్రాలు సంధించారు. జలదీక్షలో భాగంగా అప్పర్ మానేరు ప్రాజెక్టుకు వెల్లనున్న పొన్నంను సిరిసిల్ల పోలీసులు డీసీసీ కార్యాలయంలో అడ్డుకున్నారు.ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ..ఎగువ మానేరు ప్రాజెక్టు నిర్మాణానికి 2008లోనే శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ నాయకులు అప్పుడు గాడిదల పళ్లు తొమారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు. మేం గాడిదల పళ్లు తొమితే ఆరేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ నాయకులు కుక్కలు, పందుల పళ్లు తోమారా అంటు ప్రశ్నించారు. 9వ ప్యాకేజీ పూర్తికాకుండా 10వ ప్యాకేజికి కాళేశ్వరం జలాలు ఎలా వెళ్లాయో ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యమంత్రి కొడుకు, రాష్ట్ర మంత్రి అయి కూడా కాళేశ్వరం పనులకు జాప్యం ఎలా జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. అక్టోబర్ నాటికల్లా ఎగువ మానేరు పనులు పూర్తి కాకపోతే ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.