- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారు : నారా లోకేశ్

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని యూనివర్సిటీలను సీఎం వైఎస్ జగన్ వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బీసీ ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్ ట్విటర్‌లో ఏముందంటే 'యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారు జగన్ రెడ్డి. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బిసి ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతుంది.
జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరం. నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నారు. మీ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలి' అని నారా లోకేశ్ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించిన వీడియోను సైతం లోకేశ్ ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తు్న్నారు.