- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో కేసీఆర్ కు ‘ఆదివారం’ సెంటిమెంట్..!
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. ఈ క్రమంలోనే అనేక వర్గాలను కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. విద్యార్థులు, మేధావులు, రైతులు, కళాకారులు.. ఇలా రాష్ట్రంలోని సబ్బండ వర్గాలను కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్ర కోసం ఉద్యమించారు. ఈ నేపథ్యంలోనే అప్పటి యూపీఏ 2 ప్రభుత్వం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 2022లో టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వద్ద మార్పు కూడా చేయించారు. అనంతరం పక్క రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు పెడుతోంది.
అయితే ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభల విషయంలో కేసీఆర్ కు ఆదివారం సెంటిమెంట్ గా మారిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీ పేరు మార్పు తర్వాత ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పక్క రాష్ట్రాల్లో రెండు భారీ సభలు ఏర్పాటు చేసింది. 2023 ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి భారీ సభను ఏర్పాటు చేసింది. అనంతరం మార్చి 26న మహారాష్ట్రలోని లోహలో ఆ పార్టీ మరోసారి మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు సభలు కూడా ఆదివారమే జరగడం గమనార్హం. దీంతో కేసీఆర్ ఆదివారం సెంటిమెంట్ పాటిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కాగా.. జాతీయ స్థాయిలో మీడియాను ఆకట్టుకునేందుకే కేసీఆర్ ఆదివారం రోజున ఇతర రాష్ట్రాల్లో సభలు పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆదివారం ఆటవిడుపు అన్నట్లు కేసీఆర్ సభలను చూస్తే అర్థమవుతుందని, ఏదో టైంపాస్ మీటింగుల్లా ఉన్నాయని వారు ఎద్దేవా చేస్తున్నారు. కాగా కేసీఆర్ కు ఆదివారం సెంటిమెంట్ లాంటిదేమీ లేదని.. ఆ రెండు సభలు కూడా యాధృచ్చికంగా జరిగినవేనని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇక ఆదివారం కేసీఆర్ కు సెంటిమెంట్ గా మారిందనేది తేలాలంటే నెక్స్ట్ సభ వరకు ఆగాల్సిందేనని మరికొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.