కుటుంబాన్ని రక్షించుకునే ర్యాలీ : Sambit Patra

by srinivas |   ( Updated:2022-09-04 14:30:25.0  )
కుటుంబాన్ని రక్షించుకునే ర్యాలీ : Sambit Patra
X

గాంధీనగర్: బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర రాహుల్, సోనియాలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం వారివురు కుర్చీలాట ఆడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ర్యాలీ కుటుంబాన్ని రక్షించే ర్యాలీగా వర్ణించారు. వారిని వారు రక్షించుకునేందుకు సభను నిర్వహించారని చెప్పారు. కాంగ్రెస్ వ్యక్తులతో కాంగ్రెస్‌ను పంచుకోలేకపోతున్నారని విమర్శించారు. మూడో వ్యక్తికి అధ్యక్షుడిని చేసే అవకాశం లేదని అన్నారు. 2014 నుంచి రాహుల్ గాంధీ ఇదే స్క్రిప్ట్‌ను చదివి వినిపిస్తున్నారని విమర్శించారు. దీనిలో ఎలాంటి పరిపక్వత లేదని చెప్పారు. ఆయన ప్రసంగంలో భయంతో పాటు కోపం ఉందని అన్నారు.

Next Story

Most Viewed