శరద్ పవార్ రాజీనామా.. ఎన్సీపీ కోర్ కమిటీ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |
శరద్ పవార్ రాజీనామా.. ఎన్సీపీ కోర్ కమిటీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ రాజీనామా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్సీపీ కోర్ కమిటీ ముంబైలో భేటీ అయింది. అయితే ఈ కమిటీ శరద్ పవారే అధినేతగా కొనసాగాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కమిటీ కోరింది. అయితే శరద్ పవార్ రాజీనామా నిర్ణయంతో పార్టీలో ఒక్క సారిగా భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శరద్ పవార్ రాజీనామాను పార్టీ కమిటీ తిరస్కరించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా శరద్ పవార్ రాజీనామాతో ఆయన వారసత్వాన్ని సుప్రియా సూలే తీసుకుంటారని, మరో నేత అజిత్ పవార్ కీలక బాధ్యతలు చేపడతారని అనుకున్నా.. పార్టీ తాజా నిర్ణయంతో తదుపరి ఏం జరగబోతోందో అనేది ఉత్కంఠగా మారింది.

Next Story

Most Viewed