Big Breaking: ఆ పని చేసిన ఉన్మాది జగన్.. ప్రజలను మోసం చేసేందుకే ఆ యాక్ట్

by Indraja |
Big Breaking: ఆ పని చేసిన ఉన్మాది జగన్.. ప్రజలను మోసం చేసేందుకే ఆ యాక్ట్
X

దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో జగన్ మీ వద్దకు వచ్చి ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి, తలపై చేయి పెట్టేసరికి మీరంతా కరిగిపోయి.. నాడు జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే నేడు అతడికి అహంకారం నెత్తికెక్కిందని మండిపడ్డారు.

జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటానని అనుకుంటూ అధికారంతో విర్రవీగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ చేస్తారని భావించి ప్రజలు జగన్‌కి అధికారాన్ని ఇస్తే.. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతో పాలన ప్రారంభించాడని ధ్వజమెత్తారు. అమరావతిని నాశనం చేశాడని.. పోలవరాన్ని ముంచేసాడని ఆరోపించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. భూకుంభకోణాలకు పాల్పడ్డారు, ఖనిజ సంపదను కొల్లగోట్టారు, మద్యం దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పేదలు ఎక్కడైనా బాగుపడ్డారా?, ప్రజల ఆదాయం పెరిగిందా? లేక ఖర్చులు పెరిగాయా? అని ప్రశ్నించారు.

జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు? అని ప్రశ్నించారు. మీకు భూమిని జగన్ ఏమైనా ఇచ్చాడా? లేక వాళ్ల నాన్న ఇచ్చాడా? వాళ్ల తాత ఇచ్చాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మీ పొలంలో సర్వే రాళ్లపై కూడా ఆ సైకో బొమ్మలు వేసుకున్న ఉన్మాది అని జగన్‌ ను దుయ్యబట్టారు. అలానే చుక్కల భూముల్లో పెద్ద ఫ్రాడ్ జరిగిందా, లేదా? అని ప్రశ్నించారు. అదీ చాలక ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.



Advertisement

Next Story