- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ అడిగిన మంత్రి మల్లారెడ్డి (వీడియో)
దిశ, శామీర్ పేట: పాలమ్మిన, పూలమ్మిన, బోర్ వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించిన సక్సెస్ అయినా అని మంత్రి మల్లారెడ్డి పలు సందర్భాలలో చెప్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలుస్తుంటారు. తాజాగా సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం రిజిస్టర్ బుక్ లో పోలీస్ స్టేషన్ పేరు రాయడానికి పెన్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ అడగడంతో కంగుతిన్న పోలీసులు, ప్రజాప్రతినిధులు హాస్యానికి గురయ్యారు.
రాష్ట్రానికి కార్మిక ఉపాధి కల్పనా మంత్రి అయి ఉండి పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ రాకపోవడం ఏంటి అని ఆశ్చర్యపోయి పొట్ట చెక్కలయేలా నవ్వుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి మల్లారెడ్డి పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా మంత్రులు,ఎమ్మెల్యే లు, కార్పొరేటర్ల పరిస్థితి ఎలా ఉందో అని ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయ్యా కేసీఆర్ ఇకనైనా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే లకు మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కనీసం పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ వచ్చే వారికీ పదువులు ఇవ్వండి అని స్థానిక ప్రజలు కోరుతున్నారు.