- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లగొండ ఫ్లోరైడ్ పై KCR కీలక వ్యాఖ్యలు.. MP కోమటిరెడ్డి కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యపై మాట్లాడారు. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథతో నల్లగొండ జీరో ఫ్లోరైడ్‌గా మారిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కౌంటర్ ఇచ్చారు. నల్గొండ ఫ్లోరైడ్ పోగొట్టింది TRS అయితే.. 2003లో MLAగా 12 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిందెవరు?, KCR డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నపుడు ఫ్లోరైడ్ బాటిల్స్ అసెంబ్లీకి తెచ్చిందెవరు? గవర్నర్ ముందు ఫ్లోరైడ్ నీటితో అన్నం వండి చూపించిందెవరు?, రూ.600 కోట్లతో 500 గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీరు అందించింది ఎవరు?, 2009లో మినిస్టర్‌గా జిల్లా నుంచి ఫ్లోరైడ్‌ను అంతం చేసిందెవరు? అంటూ ట్వీట్టర్ ద్వారా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యలపై చేసిన పోరాటం గుర్తు చేసుకుంటూ వార్త కథానాలను జోడించి చెప్పారు.