వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పవన్ కల్యాణ్.. ఉపవాస దీక్ష మొదలుపెట్టిన జనసేనాని

by Javid Pasha |   ( Updated:2023-06-20 10:14:04.0  )
వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పవన్ కల్యాణ్..  ఉపవాస దీక్ష మొదలుపెట్టిన జనసేనాని
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఉపవాస దీక్షను మెుదలు పెట్టారు. వాస్తవానికి ఈనెల 19 నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో నవరాత్రులు చివరి మూడు రోజులు ఉపవాస దీక్ష చేపట్టాలని పవన్ కల్యాణ్ తొలుత భావించిన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ మంగళవారం నుంచి దీక్ష ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ దీక్షను పవన్ కల్యాణ్ కార్తీక మాసం చివరి వరకు కొనసాగించనున్నారు. అదే సమయంలో గురుపౌర్ణమి నాటి నుంచి చాతుర్మాస దీక్షను కూడా ఎప్పటిలాగానే పవన్ కల్యాణ్ ఆచరించనున్నారు.

ఈ ఉపవాస దీక్ష సమయంలో పవన్ కల్యాణ్ పాలు, పండ్లు మాత్రమే తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి విజయ యాత్ర పేరుతో అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ ఉపవాస దీక్ష చేపట్టడం చర్చనీయాశంగా మారింది. ఒకవైపు రాజకీయంగా దూకుడు పెంచుతూనే మరోవైపు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more :

తోక ముడిచి వెళ్తున్నారు: పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సెటైర్

వీధి రౌడీలా మాట్లాడొద్దు.. పవన్ కల్యాణ్‌పై ముద్రగడ తీవ్ర విమర్శలు

Next Story

Most Viewed