- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కర్ణాటకలో రెండోసారి రాహుల్ గాంధీ సభ వాయిదా

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటన మరోసారి వాయిదా పడింది. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటన వాయిదా పడటం ఇది రెండోసారి. కోలార్ జిల్లాలో పార్టీ తరపున రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
అయితే ఈ నెల 5వ తేదీనే ఈ సభ ఉండగా దానిని ఏప్రిల్ 9కి మార్చారు. తాజాగా రేపటి రాహుల్ గాంధీ సభ వాయిదా పడినట్లు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంలో బిజీగా ఉంటారని ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ ప్రచారానికి రావడం ఇబ్బందులు తలెత్తకుండా సభను వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే ఏప్రిల్ 16న రాహుల్ పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో కోలార్ లో చేసిన వ్యాఖ్యల కారణంగానే రాహుల్ పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో మరోసారి అక్కడే సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.