- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BJP చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: తమ్మినేని
by GSrikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లు ప్రకటించిన దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో గిరిజన రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు, గిరిజన సంఘాల పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. రిజర్వేషన్లతోపాటు పోడుభూముల సమస్యను కూడా పరిష్కరించి సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సత్వరమే జీవో విడుదల చేసి, అన్ని ఉద్యోగ నియామకాల్లో దీనిని వర్తింపజేయాలన్నారు.
Next Story