‘ఆయన అయోధ్యకు వస్తే మోడీ గ్రాఫ్ తగ్గుతుంది’

by GSrikanth |   ( Updated:2024-01-10 06:50:31.0  )
‘ఆయన అయోధ్యకు వస్తే మోడీ గ్రాఫ్ తగ్గుతుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా రాజకీయ పార్టీలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తప్పకుండా జరిగే ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీల మాదిరిగానే వామపక్షాలు కూడా పోటీ చేస్తాయని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని అన్నారు. అయోధ్యను అడ్డం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందాలని బీజేపీ మరో కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.


ఎల్‌కే అద్వానీ అయోధ్యకు వస్తే మోడీ గ్రాఫ్ తగ్గుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. అయోధ్యకు రావాలని తమకు కూడా ఆహ్వానం అందిందని.. తాము వెళ్లడం లేదని అన్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయాలని చూస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి తరహాలో తాము ఏపీలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed