- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుపై ఛత్తీస్ గఢ్ సీఎం విమర్శలు.. అది వస్తే వాళ్లకు కష్టమేనని వ్యాఖ్యలు
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూనిఫామ్ కోడ్ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై దేశంలోని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీవ్ర విమర్శలు చేశారు. రాయ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు వస్తే ఆదివాసీలు, ఇతర వర్గాలకు తీవ్ర అన్యాయం జరగుతుందని అన్నారు.
ఆదివాసీలకు వాళ్లకంటూ ఓ సంస్కృతీ సాంప్రదాయాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఈ బిల్లు కాలరాస్తుందని చెప్పారు. దేశం భిన్నత్వానికి పేరని, అలాంటప్పుడు అందరూ ఒకేలా ఉండాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఇక ఈ బిల్లుతో ముస్లింలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు.
Next Story