తెలంగాణ కాంగ్రెస్‌పై బండి సంచలన ఆరోపణలు

by GSrikanth |
తెలంగాణ కాంగ్రెస్‌పై బండి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు తీసుకుందని అన్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్నారని తాము అనడం లేదు.. కాంగ్రెస్ పార్టీకి ముట్టాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లే అని వ్యాఖ్యానించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీగా బీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ఆరోపించారు.

Advertisement

Next Story