Posani KrishnaMurali: నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-04-07 13:23:12.0  )
Posani KrishnaMurali: నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నంది అవార్డులపై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవి నంది అవార్డులు కావని, కమ్మ అవార్డులు అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో కులాలు, గ్రూపులుగా విడిపోయి అవార్డులు పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలా వచ్చింది కాబట్టే నంది అవార్డును వద్దునుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏ పని కూడా సక్రమంగా జరుగలేదని మండిపడ్డారు. కమిటీల్లో ఉన్న 12 మంది సభ్యుల్లో 11 కమ్మవారే అని అన్నారు. అందుకే అవార్డును తిరస్కరించానని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: అనాథ పిల్లలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed