62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

by srinivas |
62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి సమీపంలోని ఎస్వీ జూ పార్క్ వద్ద టాస్క్ ఫోర్స్ సిబ్బంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్ల నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెలవారుజామున తమిళ స్మగ్లర్లు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. అప్రమత్తమైన అధికారులు చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. గమనించిన స్మగ్లర్లు దుంగలు వదిలేసి చీకట్లో పారిపోయారు. ఈ సందర్భంగా టాస్క్​ఫోర్స్​ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ… గతవారం రోజులుగా తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. మూడు రోజుల్లో నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలను పట్టుకోగలిగామని వెల్లడించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

కడప జిల్లాలో మరో 32 దుంగలు..

కడప జిల్లా రామాపురం వద్ద మరో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆంజనేయులు తెలిపారు. ఆర్ ఐ ఆలీభాషా, రామాపురం పోలీసు సిబ్బంది తో చేసిన జాయింట్ ఆపరేషన్ లో దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రామాపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed