- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

దిశ,సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోనీ మహాత్మ జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లలో జరిగే ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
ఈ నెల 30 బుధవారం రోజున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుదని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల నుండి 500 మీటర్ల లోపు వున్న అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని, పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని ఆయన తెలిపారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామనీ అన్నారు. పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయాలని పోలీస్ అధికారులకు ఆయన సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… పరీక్షా సమయం కన్నా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.