- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS ఎమ్మెల్యే పర్యటనలో ఉద్రిక్తత.. ఆగ్రహంతో పోలీసుల లాఠ్టీచార్జ్..(వీడియో)
దిశ, ఆదిలాబాద్ : బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు నిరసన సెగ తగిలింది. మంజూరైన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించాలంటూ గ్రామస్తులు అడ్డుకోగా.. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వివరాల ప్రకారం.. తలమడుగు మండల కేంద్రంలో దళిత బస్తీ లబ్ధిదారులకు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును ఆ గ్రామస్తులు అడ్డుకొని కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించాలని కోరారు. కాగా..ఈ కమ్యూనిటీ హాల్ మంజూరై టెండర్ పూర్తి అయింది. సదరు కాంట్రాక్టర్ గడువులోగా ప్రారంభించకపోవడంతో టెండర్ రద్దు అయింది. దీంతో మళ్లీ పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. టెండర్ పూర్తి అయిన తర్వాతనే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే చెప్పడంతో గ్రామస్తులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు వినకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పలువురు నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే దళితబస్తీ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు దళితులపై దాడిని ఖండించారు. వెంటనే ఎమ్మెల్యే దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి.