వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం: పోచారం

by Shyam |
వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం: పోచారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలోని కల్కి చెరువులో శుక్రవారం ఆయన చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. చెరువులకు అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. మత్స్యకారులకు సంచార వాహనాలు ఇచ్చి చేపలను ఎక్కడైనా విక్రయించుకునే విధంగా వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను శాశ్వతంగా రూపుమాపడం కోసం 100 శాతం రాయితీపై సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 27 లక్షల చేప పిల్లలను వివిధ చెరువుల్లో విడుదల చేస్తున్నామన్నారు.

ఐసీయూ సెంటర్ ప్రారంభం..

వైద్యులు తమ సేవలను మరింతగా మెరుగుపరుచుకోవాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఆయన 10 పడకల ఐసీయూ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాతలు విక్రమ్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి తమ తల్లిదండ్రులైన బోడ గంగారెడ్డి, శారదా రెడ్డి జ్ఞాపకార్థం ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. 30 లక్షల రూపాయలు వెచ్చించి.. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed