5న లైట్లు బంద్ చేసి.. దీపాలు వెలిగించండి: పీఎం మోడీ

by Shamantha N |   ( Updated:2020-04-03 00:06:46.0  )
5న లైట్లు బంద్ చేసి.. దీపాలు వెలిగించండి: పీఎం మోడీ
X

న్యూఢిల్లీ : కరోనా వైరస్ చీకట్లను తరిమికొట్టేందుకు పౌరులందరూ వెలుగులను ప్రసరింపజేయాలని ప్రధాని మోడీ కోరారు. ఈ నెల 5న (ఆదివారం) రాత్రి 9 గంటలకు లైట్లను బంద్ చేసి, ప్రతి ఒక్కరూ క్యాండిల్స్ లేదా దీపాలు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లను 9 నిమిషాలు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను ఎదుర్కొనే పోరాటంలో ఎవరూ ఒంటరిగా ఉన్నానని భావించవద్దని, మనమంతా సమైక్యంగా ఈ పోరు సల్పుతున్నామని తెలిపే సంఘీభావ ప్రకటనగా అందరూ ఒకేసారి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. అయితే ఆ సమయంలో బయట జనం గుమిగూడొద్దని అభ్యర్థించారు. లక్ష్మణ రేఖను దాటొద్దని.. సామాజిక దూరాన్ని తప్పక పాటించాలని కోరారు. క్యాండిల్ లైట్లు పట్టుకుని వీధిల్లోకి రావాల్సిన అవసరం లేదని, ఇంటి గడప ముందు లేదా బాల్కనీలో నిలబడితే చాలు అని చెప్పారు.

జనతా కర్ఫ్యూ నాడు ప్రాణాలు లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టాలని, ఇతర వస్తువులను మోగించాలని ప్రధాని కోరగా పౌరులు వీధిల్లోకి వచ్చి మూకుమ్మడిగా(సామాజిక దూరాన్ని పాటించకుండా) పాల్గొన్నారు. కొన్నిచోట్ల అయితే ర్యాలీలు తీశారు. ఈ ప్రదర్శనపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Tags: Pm modi, off lights, lit candles, sunday, 9 minutes, diya

Advertisement

Next Story

Most Viewed