జవాన్లకు ‘సెల్యూట్’గా దీపం వెలిగించండి : మోడీ

by Anukaran |   ( Updated:2020-11-13 08:04:38.0  )
జవాన్లకు ‘సెల్యూట్’గా దీపం వెలిగించండి : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘సరిహద్దుల వెంబడి దేశానికి రక్షణగా నిలుస్తూ, విధులు నిర్వహిస్తున్న సైనికులుగా గౌరవ వందనంగా దీయాను వెలిగించాలని ప్రధాని సూచించారు.

భారతదేశ సైనికులు చూపిస్తున్న శ్రేష్టమైన ధ్యైర్యానికి కృతజ్ఞతా భావం అనే పదాలు ఏ మాత్రం న్యాయం చేయలేవని మోడీ అభిప్రాయం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న సైనికుల కుటుంబాలకు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రధాని తెలిపారు.

Advertisement

Next Story