కరోనా సమయంలో ‘ఆశా కిరణం’ యోగ : ప్రధాని

by Shamantha N |   ( Updated:2021-06-21 00:59:55.0  )
Narendra Modi address International Day of Yoga
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సమయంలో కరోనా మహామ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు యోగ ఓ రక్షణ కవచంగా మార్చుకోవాలన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో యోగ ఓ ఆశాకిరణంలా నిలిచిందని తెలిపారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాలని, కరోనా విముక్తకి ప్రతీ ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.

కరోనా సమయంలో దేశంలో లక్షలాది మంది యోగా సాధకులుగా మారారని తెలిపారు. చాలా పాఠశాలలు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించినట్టు మోదీ పేర్కొన్నారు. అలానే యోగా ద్యారా రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది, రోగ నిరోధక వ్యవస్థపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుందని, అంతర చైతన్యం పెంపొందుతుందని వెల్లడించారు. ముందస్తు రక్షణ కవచంగా యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. యోగా ఫర్ వెల్ నెస్ ‘ఆరోగ్యం కోసం యోగా’ అనే థీమ్ తో ఈ ఏడాది యోగా డేని నిర్వహించుకుంటున్నట్లు మోదీ తెలిపారు. శారీర‌క, మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధ‌న చేయాల‌నేది ఈ నినాదం ఉద్దేశమని ప్రధాని తెలిపారు. 2015 నుంచి జూన్ 21 వ తేదీని అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నారు.

యోగా డే : శరీరాన్ని విల్లులా వంచిన బామ్మ

Advertisement

Next Story