ఉగాదికి ప్రధాని అచ్చ తెలుగు ట్వీట్

by Shamantha N |
ఉగాదికి ప్రధాని అచ్చ తెలుగు ట్వీట్
X

నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అచ్చ తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. కరోనా భయంతో తెలుగు రాష్ట్రాలు నిరాడంబరంగా ‘ఉగాది’ పర్వదినాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో “ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను” అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. దీనితో పాటు ఇతర భాషల్లో కూడా ప్రజలకు ట్విట్టర్ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


Tags: prime minister, twitter, narendra modi, ugadi tweet

Next Story