- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బ్రేకింగ్ : పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ అసహనం
దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొద్దిసేపటి కిందటే ప్రారంభమయ్యాయి. తొలుత ఏపీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తితో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభించగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కొత్తగా కేబినెట్‌లోకి వచ్చిన మంత్రుల పరిచయ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని ప్రధాని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు సభలో ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుందని తాను అనుకున్నానని, కానీ అందుకు విరుద్ధంగా ఉందని అసహనం వ్యక్తంచేశారు. మహిళలు, దళితులు, బలహీనవర్గాల వారికి పెద్ద సంఖ్యలో మంత్రి పదవులు దక్కాయని మోడీ గుర్తుచేశారు. అయితే, సమావేశాలు ప్రారంభం నుంచి దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. దీనికి తోడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.