నా ప్రియమిత్రుడికి స్పెషల్ థ్యాంక్స్ : మోడీ

by Shamantha N |
నా ప్రియమిత్రుడికి స్పెషల్ థ్యాంక్స్ : మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తన ప్రియ మిత్రుడిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ పట్ల నెతన్యాహుకు ఉన్న ప్రత్యేక ఆత్మీయత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

‘భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినందుకు నా ప్రియ మిత్రుడు బెంజమిన్ నెతన్యాహుకు, అద్భుతమైన ఇజ్రాయెలీ ప్రజలకు ధన్యవాదాలు. భారతదేశం పట్ల ఇజ్రాయెలీ ప్రధానికి ఉన్న ప్రత్యేక అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

అంతకుముందు ఇజ్రాయిల్ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నా అత్యంత ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీ, అద్భుతమైన భారత దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed