బిహార్ అభివృద్ధిలో నితీష్ పాత్ర కీలకం: ప్రధాని మోడీ

by Anukaran |
బిహార్ అభివృద్ధిలో నితీష్ పాత్ర కీలకం: ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే నితీష్ కుమార్ నేతృత్వంలోనే బరిలోకి దిగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. జేడీ(యూ), ఎల్‌జేపీల మధ్య అభిప్రాయభేదాలు సాగుతున్న తరుణంలో నితీష్ పాలనపై మోడీ ప్రశంసలు కురిపించారు. నూతన భారతం, నూతన బిహార్ కోసం రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారని అన్నారు. బిహార్‌లో సుపరిపాలన కొనసాగడానికి అందరూ సహకరించాలని తెలిపారు. 15 ఏళ్లుగా సాగుతున్న ఈ పాలన ఇలాగే ఇకపైనా కొనసాగాలని అన్నారు. సరైన సర్కారు ఉంటే విధానాలు, నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికీ చేరువవుతాయనడానికి నితీష్ ప్రభుత్వమే తార్కాణమని పేర్కొన్నారు. నితీష్ సర్కారు హయాంలోనే ఉన్నత విద్యా సంస్థలు వచ్చాయని, మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని తెలిపారు. బిహార్‌లో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం తామంతా పనిచేస్తున్నామని వివరించారు.

కరోనా కట్టడి చర్యలు, నిరుద్యోగం సహా పలుఅంశాలపై నితీష్ కుమార్‌కు ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ల మధ్య అభిప్రాయభేదాలు పొడసూపాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎల్‌జేపీ తిరిగి తమ దారిలోకి రావడానికి ద్వారాలు తెరిచారు. ఈ విభేదాలు కొనసాగుతుండగానే బిహార్‌లో నితీషే ఎన్డీయేకు సారథి అని మోడీ ప్రశంసలతో స్పష్టమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed