- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం.. ప్రధాని మోడీ హాజరు
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే, రేపటి నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సహకరించాలని ప్రధాని మోడీ విపక్షాలను కోరారు. ఈ సమావేశాల్లో సభలో 15 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో మోడీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రతిపక్షాలు మాత్రం పెరుగుతున్న చమురు ధరలు, గ్యాస్ ధరలపై నిరసనలు తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.
Next Story