భారీగా పెరిగిన ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు

by Anukaran |   ( Updated:2020-09-11 08:57:27.0  )
భారీగా పెరిగిన ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు
X

దిశ వెబ్ డెస్క్: రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి దేశ వ్యాప్తంగా 80 ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో రైల్వే ప్లాట్ ఫామ్ లలో రద్దీని తగ్గించేందుకు సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బెంగుళూరులోని మూడు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో బెంగుళూరులోని కేఎస్ఆర్ బెంగుళూరు, యశ్వంత్ పూర్ జంక్షన్, బెంగుళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లలో పెంచిన ధరలను అమలులోకి తేనున్నారు. కాగా ఈ ధరలు తాత్కాలికంగా పెంచినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇక ఇది ఇలా ఉండగా ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో క్లోన్ ట్రైన్స్ నడుపుతామని రైల్వే శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed