ప్లాస్మా ట్రీట్మెంట్‌ ఇక వద్దు : ఐసీఎంఆర్ కీలక ప్రకటన

by Anukaran |
ప్లాస్మా ట్రీట్మెంట్‌ ఇక వద్దు : ఐసీఎంఆర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ చికిత్సలో ప్లాస్మా వినియోగాన్ని తొలిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మైల్డ్ లక్షణాలు ఉన్నవారికి ఇకమై హోం ఐసోలేషన్ రిఫర్ చేయాలని స్పష్టం చేసింది. మోడరేట్ కేసులకు వార్డులో, సీరియస్ కేసులకు మాత్రం ఐసీయూలో చేర్చి చికిత్స అందించాలని తెలిపింది. శ్వాసలో ఇబ్బంది లేకపోతే మైల్డ్ కేసులుగా వర్గీకరించాలని పేర్కొంది. నిమిషానికి 24 సార్లు కంటే ఎక్కువగా శ్వాస తీసుకుంటే మోడరేట్ కేసుగా పరిగణించాలని, ఆక్సిజన్ 93 శాతానికి దిగువన 90కు ఎగువన ఉంటే మోడరేట్ కేసుగా భావించాలని వెల్లడించింది.

నిమిషానికి 30 సార్లు కంటే ఎక్కువగా శ్వాస తీసుకుంటే సీరియస్ కేసుగా పరిగణించాలని ఐసీఎంఆర్ తెలిపింది.మోడరేట్, సీరియస్ కేసులకు మాత్రమే రెమిడిసివిర్ ఉపయోగించాలని సూచించింది. అయితే, కరోనా చికిత్సలో ప్లాస్మా వినియోగించడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని డాక్టర్ ఫోరం సంఘం ఐసీఎంఆర్‌కు విన్నవించింది. ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్, ఐసీఎంఆర్, టాస్క్ఫోర్స్ నివేదికల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed