- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రహణంతో కరోనా ఎంతశాతం ఖతమంటే…
X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యగ్రహణం కారణంగా అతినీలలోహిత కిరణాలు భూమిపై పడి కరోనా 0.001శాతం మాత్రమే చనిపోతుందని, హండ్రెడ్ పర్సెంట్ కరోనా అంతం కాదని ప్లానిటరీ సొసైటీ శాస్త్రవేత్త రఘుంనదన్ అన్నారు. ఆదివారం అద్భుత ఖగోళ సంఘటన జరగబోతుందని, విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుంచి మధ్యాహ్నం 3.04 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని పేర్కొన్నారు. మొదటగా మనదేశంలో గుజరాత్ రాష్ట్రంలో గ్రహణం చూస్తారని, కొన్నిప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతోందన్నారు. ఆదివారం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 వరకు 51శాతం గ్రహణం ఉంటుందని, అటు ఏపీలో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49గంటల వరకు 46శాతం గ్రహణం ఉంటుందన్నారు. గ్రహణ సమయంలో గర్భిణీలు తినకూడదు, బయటకు రావొద్దని మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారని ఇవన్నీ అబద్ధం అన్నారు.
Advertisement
Next Story