బీహార్ సీఎం నితీశ్‌పై పీకే ఫైర్

by Shamantha N |
బీహార్ సీఎం నితీశ్‌పై పీకే ఫైర్
X

బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ వేదిక విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లలో 46 మంది మరణించినా నితీశ్ స్పందించకపోవటం దారుణమన్నారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామంటున్నా నితీశ్.. తన 15 ఏళ్ల పాలనలో బీహార్ పేద రాష్ట్రంగానే ఉండిపోయిందన్నదానికి సమాధానం చెప్పాలని పీకే డిమాండ్ చేశారు. నిరుద్యోగం కారణంగానే బీహార్ యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని పీకే అన్నారు. దీనిపై నితీశ్ కుమార్ సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. దేశమంతా ఒక్కటేనని, ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చని.. దీన్ని సమస్యగా చూడొద్దని అన్నారు.

Tags: pk, election strategist, nitish kumar, bihar politics

Advertisement

Next Story