- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడమర్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థి జేఏసీ నేత, మాదిగ జేఏసి వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మదిర జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ హైదరాబాద్ ఇంచార్జ్ బోయిని ఎల్లేష్ మాదిగ, జేఏసి హైదరాబాద్ పార్లమెంట్ బాధ్యులు చిత్రం సురేష్ మాదిగ, దొడ్డి ధన్ రాజ్ మాదిగలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి సంఘ నాయకునిగా ఆయన తన వంతు కృషి చేశారన్నారు. అనంతరం జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేపట్టి అధికారంలోకి రావడానికి నిరంతరం పని చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సగం జనాభా కలిగిన మాదిగలకు రాజకీయ పదవులు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రుడుగా డాక్టర్ పిడమర్తి రవికి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మాదిగ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు దక్కినట్లవుతుందని వారు పేర్కొన్నారు.