- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వానికి షాకిస్తున్న PHC ఉద్యోగులు..
దిశ, అచ్చంపేట : తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు PHC (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గల అన్ని పీహెచ్‌సీ సెంటర్స్ వద్ద కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పనికి తగిన వేతనాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర ఐక్య వేదిక పిలుపు మేరకు మంగళవారం భోజన విరామ సమయంలో పీహెచ్‌సీల వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎల్‌టిలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, 104 అండ్ 108 సిబ్బంది, ఫార్మసీ, ఫార్మాసిస్ట్ వేతనాల గురించి ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం అందించినా స్పందన కరువైందన్నారు. ఈ నేపథ్యంలోనే నల్ల బ్యాడ్జీలతో జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ సెంటర్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు చెబుతున్నారు.