ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక!

by Harish |
ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీ ఆథర్ ఎనర్జీ 135 స్థానాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ గ్రిడ్‌లను ఏర్పాటు చేసే మొదటిదశ ప్రణాళికలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని వెల్లడించింది. మొత్తానికి 2022 నాటికి దేశవ్యాప్తంగా 6,500 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆథర్ ఎనర్జీ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయ అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రస్తుతం ఆథర్ ఎనర్జీ 150 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంది.

వీటిలో బెంగళూరులో 37, చెన్నైలో 13 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్ నెట్‌వర్క్ అన్ని ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలు, ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లకు వినియోగించేలా ఉంటాయని, అలాగే..ఆథర్ 450 ఎక్స్ స్కూటర్‌ను 10 నిమిషాల్లో 15 కి.మీ వేగంతో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ‘ ప్రస్తుతం బెంగళూరు, చెన్నైలో స్థిరమైన మార్కెట్‌ను కలిగి ఉన్నామని, రానున్న రోజుల్లో తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు యాక్సెస్ చేయగల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ముఖ్యమని భావిస్తున్నాం.

అందుకే వీలైనంత వేగంగా ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాట్లను కొనసాగిస్తున్నామని’ ఆథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా చెప్పారు. భారత్‌లో ఇప్పటికే 135 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టెషన్ల ఏర్పాటుకు తొమ్మిది ప్రదేశాలను ఖరారు చేసినట్టు కంపెనీ తెలిపింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story