చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్

by srinivas |
చంద్రబాబు ఇలాఖాలో రూ.110 దాటిన పెట్రోల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రోజురోజుకూ ఆకాశానంటుతున్నాయి. గడచిన రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.25 మేర పెరిగిన ఇంధన చార్జీల ధరలకు ఇప్పటికీ బ్రేక్ పడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాదే పన్నులతో మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఏపీలోని చిత్తూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పెట్రోల్ ధర రూ.110 మార్క్ దాటింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ధర ఎక్కువగా ఉంది.

ముఖ్యనగరాలైన విశాఖలో రూ.106.80 , విజయవాడలో రూ.107.63గా ఉంది. అయితే, స్టోరేజి కేంద్రాల నుంచి కుప్పం నియోజకవర్గం దూరంగా ఉండటంతో రవాణా చార్జీలను కలుపుకుని పైన చెప్పిన ధరకు పెట్రోల్ విక్రయిస్తున్నారు. అంతేకాకుండా, విజయవాడలోని భవానీపురం, బెంజిసర్కిల్ ఏరియా మధ్య దూరంలో కూడా పెట్రోల్ చార్జీల్లో వ్యత్యాసం కనపడుతోంది. డీజిల్, వంటగ్యాస్ ధరల్లోనూ ఇదే తరహా నిబంధనను డీలర్ షిప్ యాజమాన్యాలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed