ఖైదీలకు ఉపాధి.. ప్రభుత్వానికి ఆదాయం

by Shyam |   ( Updated:2021-02-04 20:50:15.0  )
ఖైదీలకు ఉపాధి.. ప్రభుత్వానికి ఆదాయం
X

దిశ, కల్వకుర్తి: శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో పాటు శిక్ష పూర్తయిన వారికి కూడా జైళ్ల శాఖ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని జైళ్ల శాఖ ఐజీ సైదయ్య అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐజీ సైదయ్య మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల ఏర్పాటుతో పాటు ఖైదీలతో ఇతర వస్తువులు తయారీలో ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల నిర్వహణతో శాఖకు ఆదాయం రావడంతో పాటు ఖైదీలకు ఉపాధి దొరుకుతుందన్నారు. శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలకు నెలకు రూ.5 వేలు, శిక్ష పూర్తయిన వారికి రూ. 12వేలు వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఖైదీల ప్రవర్తనలో మార్పు కోసం జైళ్లశాఖ కొత్త వనరులను సృష్టిస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో సహకరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ భాస్కర్, ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ఎస్ రావు, కల్వకుర్తి జైల్ సూపరిండెంట్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed