‘గూగుల్ పే’ పై చర్యలు.. ఏమంటారు?

by Shamantha N |
‘గూగుల్ పే’ పై చర్యలు.. ఏమంటారు?
X

దిశ, వెబ్‌డెస్క్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందంటూ.. ఆన్ లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ‘గూగుల్‌ పే’ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పందన కోరింది. అలాగే, ప్రభుత్వ అధికారులకు, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది.

యూపీఐ నుంచి ఎటువంటి డేటాను కూడా థర్డ్ పార్టీలతో పంచుకోవద్దని పిటిషనర్, లాయర్ అభిషేక్ వర్మ కోర్టును ఆశ్రయించారు. అలాగే, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీస్‌కు యూపీఐ పర్యావరణ వ్యవస్థ కింద యాప్ లో డేటాను నిల్వ చేయకుండా కోర్టు ఆదేశించాలని పిటిషన్‌లో వెల్లడించారు. ఇటువంటి నిబంధనలను ఉల్లంఘించిన సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, గూగుల్ పే సంస్థకు ఆర్బీఐ జరిమానా విధించేలా ఆదేశించాలని లాయర్ వాదించారు.

పిటిషనర్ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 24 వాయిదా వేసింది.

Advertisement

Next Story