పత్రికా స్వేచ్ఛను నిర్వచించండి: సుప్రీంలో పిటిషన్

by Anukaran |
పత్రికా స్వేచ్ఛను నిర్వచించండి: సుప్రీంలో పిటిషన్
X

న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛను నిర్వచించి, మీడియాలో దుందుడుకుతనాన్ని నియంత్రించాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తి, సమూహం, మత-రాజకీయ సంస్థల మనోభావాలు దెబ్బతీస్తూ, ప్రతిష్టకు భంగం కలిగిస్తూ పత్రికా స్వేచ్ఛ అంటూ ప్రసారాలు చేస్తున్న మీడియా సంస్థలకు కళ్లెం వేయాలని కోరారు.

పత్రికా స్వేచ్ఛ పేరిట కొన్ని మీడియా సంస్థలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని, మతపరమైన బాబాలు, ఆధ్యాత్మక, రాజకీయ సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు వెలువరిస్తున్నాయని న్యాయవాది రీపక్ కన్సాల్ ఆరోపించారు. వీటిని నిలువరించడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ ధోరణులను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఒక పర్యవేక్షణ బాడీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్ వారంరోజుల్లో విచారణకు రానున్నది.

Advertisement

Next Story

Most Viewed