మద్యానికి బానిసై.. అప్పులు తీర్చలేక ఉరేసుకుని..

by Sumithra |   ( Updated:2021-05-26 11:40:26.0  )
మద్యానికి బానిసై.. అప్పులు తీర్చలేక ఉరేసుకుని..
X

దిశ, హాలియా : మద్యానికి బానిసై అప్పులు తీర్చలేక సింగి సంతోష్(25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం నిడమనూరు మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన సింగి సంతోష్ గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఊర్లో విపరీతమైన అప్పులు చేశాడు. తీరా అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తీవ్రతరం కావడంతో ఎవరూ లేని సమయంలో చూసి చీరతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈరోజు మధ్యాహ్నం అదే ఇంట్లో కిరాయికి ఉండే వ్యక్తి పని ముగించుకుని వచ్చేసరికి సంతోష్ ఉరివేసుకుని కనిపించాడు. అతను వెంటనే ఇంట్లో వారికి, పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. సంతోష్ మృతి పట్ల తల్లి సింగి భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు నిడమనూరు ఎస్‌ఐ కె కొండల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story