- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్ : నగరంలో మరో భయానక ఘటన.. పెళ్లికి నో చెప్పిందని ప్రియురాలికి కత్తి పోట్లు..
దిశ, ఎల్బీనగర్ : హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన జరిగింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని.. తనతో కాకుండో మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుందంటూ ఓ యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడో యువకుడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన ఓ యువతి.. అదే గ్రామానికి చెందిన బస్వరాజ్ (24) అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే, గత 3 నెలల క్రితం మరో వ్యక్తితో సదరు యువతికి పెళ్లి నిశ్చయం అయ్యింది.
అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు బస్వరాజ్. అయితే, ఆమె పెళ్లికి నిరాకరించడంతో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో.. ప్రస్తుతం ఆ యువతి కుటుంబం నివాసం ఉంటున్న హస్తినాపురంలోని ఇంటికి వెళ్లాడు. కత్తితో అతి కిరాతకంగా దాడికి దిగాడు. ఈ దాడిలో ఏకంగా యువతికి 18 కత్తి పోట్లు పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉండగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 18 చోట్ల కత్తిపోట్లు ఉండగా, రెండు చోట్ల (ఛాతి, ఊపిరితిత్తులు) తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉందని, అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ వి.అశోక్ రెడ్డి తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.