- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనాజీపూర్‌లో విషాదం.. స్నానానికి వెళ్లి యువకుడి మిస్సింగ్
దిశ, దౌల్తాబాద్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన అనాజీపూర్ పెద్ద చెరువులో సోమవారం వెలుగుచూసింది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాయపోల్ గ్రామానికి చెందిన గుని ఆంజనేయులు (28) వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారి సమీప బంధువు ఇటీవల మృతి చెందగా స్నానం చేసేందుకు అనాజీపూర్ పెద్ద చెరువు వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
అందరూ స్నానాలు చేసి ఇంటికి వస్తున్న క్రమంలో ఆంజనేయులు చెరువులో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకుని ఆంజనేయులు ఆచూకీ కోసం నీటిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. రాయపోల్ ఎస్ఐ మహబూబ్, ట్రైనింగ్ ఎస్ఐ గోపి, పోలీసులు బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. ఆంజనేయులు ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబీకులు కంటతడి పెట్టిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. మంగళవారం ఉదయం గజ ఇతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపడుతామని పోలీసులు తెలిపారు.